మెదక్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఏడు పాయలలోని వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం అందజేశారు. అమ్మవారి మీద అచంచలమైన భక్తితో తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ మేరకు రూ.5 లక్షల చెక్ ను ఆలయ కమిటీకి ఎమ్మెల్సీ కవిత అందజేశారు. ఎమ్మెల్సీ కవిత, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డితో కలిసి గతంలో ఏడుపాయల పుణ్యక్షేత్రంలోని వనదుర్గా మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Edupayala Temple: కవిత రూ.5 లక్షల విరాళం!

Kavitha