Site icon HashtagU Telugu

MLC Kavitha : తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదు

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha : తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకటనను ఎక్స్ వేదికగా ఖండించిన ఆమె, రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ ఈ అంశంపై వారు స్పందించకపోవడం బాధకరమని విమర్శించారు. కవిత తన వ్యాఖ్యల్లో, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఈ అంశంపై మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదని, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Dream Science: కలలో నలుపు, తెలుపు పాము కనిపించడం మంచిదేనా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం గళమెత్తినట్లు కవిత గుర్తు చేశారు. 2013లో, రాష్ట్రం ఏర్పడకముందే, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని, బయ్యారంలో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని వివరించారని తెలిపారు. ఈ పరిశ్రమ స్థాపన స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను అందిస్తుందని, తెలంగాణ విభజన చట్టంలో ఈ హామీ స్పష్టంగా ఉన్నప్పటికీ, 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదని ఆమె పేర్కొన్నారు.

కేంద్రం సాకులు, రాష్ట్రం కృషి

బయ్యారంలో ఐరన్ ఓర్ నాణ్యత సరిపోకపోవడం వల్ల పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం సాకులు చెబుతోందని కవిత ఆరోపించారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా ఛత్తీస్‌ఘడ్ నుంచి ఐరన్ ఓర్ తీసుకురావడంపై కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లు ఆమె గుర్తుచేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విభజన చట్టం అమలు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యమని నిరూపించేందుకు కేంద్రం చిత్తశుద్ధి చూపించాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని, బయ్యారం ఉక్కు పరిశ్రమ అమలవడం ద్వారా లక్షలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కవిత తెలిపారు. బీజేపీకి నిజమైన తెలంగాణ ప్రేమ ఉంటే, వెంటనే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు.

Astrology : ఈ రాశివారికి నేడు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది.!

Exit mobile version