Site icon HashtagU Telugu

Hyderabad : హ‌కీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మైన‌ర్ బాలిక‌పై వేధింపులు.. అధికారిని స‌స్పెండ్ చేయాల‌ని క‌విత ట్వీట్‌

Mlc Kavitha

Mlc Kavitha

హ‌కీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మైన‌ర్ బాలిక‌పై అధికారి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీనిపై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సీరియ‌స్ అయ్యారు. మైనర్ బాలికపై అధికారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే వార్తా కథనంపై స్పందించిన కవిత.. అధికారి చేసిన క్రూరమైన నేరాన్ని ఖండిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆమె అన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆమె కోరారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని మంత్రిని కోరారు.దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న అధికారిని స‌స్పెండ్ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపి.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.