Site icon HashtagU Telugu

World Cup 2023: కొత్త బ్యాట్ లు రెడీ… ఇక విధ్వంసమే

Kashmir Willow Bats

Kashmir Willow Bats

World Cup 2023: కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్యాట్లను వినియోగించే అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈసారి భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ కు తొలిసారి ఈ బ్యాట్ ను వినియోగించనున్నారు. ఏకంగా 17 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాశ్మీర్ విల్లో బ్యాట్ తో మైదానంలోకి దిగి బౌండరీల వర్షం కురిపించాలని భావిస్తున్నారు.

సాధారణంగా క్రికెట్లో ఆటగాళ్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో ఆడుతారు. అయితే కాశ్మీర్ విల్లో బ్యాట్‌లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్‌లతో పోలిస్తేచాలా చౌక. కాశ్మీర్ విల్లో బ్యాట్ల నాణ్యత కూడా బాగుంటుంది. ఈ మోడల్ బ్యాట్లు 10,000 నుంచి 12,000 వరకు ఉంటాయి. ఇంగ్లీష్ విల్లో బ్యాట్ ధర లక్ష వరకు ఉంటుంది. అందుకే యువకులు కాశ్మీర్ విల్లో బ్యాట్‌ల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తు్న్నారు. పైగా ఈ బ్యాట్లతో సిక్సులు, ఫోర్లు సునాయాసంగా బాదడానికి అవకాశం ఉంటుంది పన్నెండేళ్ల తరువాత ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఇండియా ఆతిధ్యమిస్తుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి జట్లు కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో యూఏఈ, వెస్టిండీస్, ఒమన్ ఆటగాళ్లు ఈ కాశ్మీర్ విల్లో బ్యాట్ ల తోనే బరిలోకి దిగారు.102 ఏళ్లుగా కశ్మీర్ వ్యాలీలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను తయారుచేస్తున్నారు. తొలిసారి 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఈ బ్యాట్లను వినియోగించనున్నారు.

Also Read: Asian Games 2023: ఆసియా క్రీడల్లో పరుల్ చౌదరికి బంగారు పతాకం