Kashmir Files : యూపీ సీఎం ఇలాకాలో ది కశ్మీర్ ఫైల్స్…!!

వివేక్ అగ్నిహోత్రి...వివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ సంచలనాలు క్రియేట్ చేయడంలో దిట్ట. తాజాగా ఆయన తెరకెక్కించిన అత్యంత వివాదాస్పద మూవీ..ది కశ్మీర్ ఫైల్స్.

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 01:31 PM IST

వివేక్ అగ్నిహోత్రి…వివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ సంచలనాలు క్రియేట్ చేయడంలో దిట్ట. తాజాగా ఆయన తెరకెక్కించిన అత్యంత వివాదాస్పద మూవీ..ది కశ్మీర్ ఫైల్స్. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ మిథున్ చక్రవర్తి పల్లవి జోషీ దర్శన్ కుమార్ మెయిన్ రోల్స్ లో యాక్ట్ చేశారు. కశ్మీర్ పండిట్ ల నరమేధం నేపథ్యంలో ఈ చిత్రా తెరకెక్కించారు. ఈ మధ్య ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేస్తే…మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజకీయ వర్గాలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ చిత్ర బృందంపై ప్రశంసలు జల్లులు కురిపిస్తున్నార. భారతీయ చరిత్రలో రక్తంతో రాసిన అత్యంత భయంకరమైన అంశాలను ఉన్నది ఉన్నట్లు కళ్లకు కట్టి చూపించారు అగ్నిహెత్రి. కశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణ మారణ కాండని…చూపించడంలో అగ్నిహెత్రి విజయం సాధించారని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి అభినందించారు.

లేటెస్టుగా ది కశ్మీర్ ఫైల్స్ టీం…యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదుపూర్వకంగా కలిసింది. సీఎం యోగీ చిత్ర టీమ్ ప్రశంసించారు. యోగిని కలిసిన వారిలో చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ ఉన్నారు. 1990లో కశ్మీర్ లో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని జరిపిన దారుణ మారణకాండ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఎన్నో వ్యయప్రయాసల మధ్య తెరకెక్కించారు. ఈ మూవీపై ఓ వర్గం చేస్తున్న విమర్శలతో దర్శకుడికి ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కూడా కల్పించింది. మార్చి 11న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 150కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.