Site icon HashtagU Telugu

Karthika Masam: ఈ కార్తీక మాసంలో నదీ స్నానం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

Karthika Masam

Karthika Masam

Karthika Masam: కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత కలిగిన మాసం. ఈ నెలలో నిర్వహించే నదీ స్నానం, దీప దానం, శివ-కేశవుల పూజలు అత్యంత విశిష్టమైనవి. కార్తీక మాసం సూర్యోదయానికి ముందే, అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు, ప్రవహించే నీటిలో స్నానం చేయాలని పెద్దలు సూచించారు. ఈ మాసం చలికాలానికి ప్రారంభదశగా, శరీరానికి ధృడత్వం సంతరించుకునేందుకు ఈ చలికాలంలో తెల్లవారు జామున నదీ స్నానం చేయడం కచ్చితమైన నియమం.

చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం అయితే సాధ్యమైనా, చల్లని నీటితో స్నానం చేయడం కష్టం అవుతుంది. నిల్వ నీరు మరింత చల్లగా ఉంటే, భూగర్భంలో నుంచి వచ్చిన నీరు కొంచెం వెచ్చగా ఉండి, స్నానం చేసినప్పుడు శరీరానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే పెద్దలు ఈ మాసంలో నదీ స్నానం నియమం ఉంచారు.

Livar Damage : ఈ పానీయాలు శరీరం యొక్క కాలేయాన్ని నాశనం చేస్తాయి..! ఇది మేం చెప్పడం లేదు, వైద్యులు చెబుతున్నారు..!

నదీ స్నానానికి ఔషధ గుణాలు
కార్తీక మాసంలో, వరద నీరు శుభ్రముగా మారుతుంది. రాళ్లను, వృక్షాలను రాసుకుంటూ ప్రవహించే నదుల్లో ఆయా ఖనిజాలు , మూలికలు కలసి ఉంటాయి. ఈ కారణంగా, నదీ నీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల, ఈ నెలలో నదీ స్నానం ఆరోగ్యానికి మంచిది అని పెద్దలు నిర్ణయించారు.

చంద్రుని శక్తి
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, నీటి మీద , మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటుంది, అందుకే కార్తీక మాసాన్ని ‘కౌముది మాసం’ అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు అని నమ్మకం ఉంది. నదులను దైవంగా భావించి, వీటిని పూజిస్తారు. నీటిలో దీపాలు విడిచి, భక్తిశ్రద్దలతో నీటిని పూజిస్తారు.

స్నాన విధానం
ఏ నదిలో లేదా ఇంట్లో స్నానం చేసినా సరే, “గంగేచ యమునేచైవ, గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ” వంటి మంత్రాలను పఠిస్తూ నదులను కీర్తిస్తూ స్నానమాచరిస్తారు. ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామున నిద్ర లేచి నదుల వద్ద చేరుకుని, స్నానం చేసి సంకల్పం చెప్పడం, పితృదేవతలను తల్చుకోవడం , దానం చేయడం ఆనవాయితీ.

అరటి కాండంలో దీపాలను వెలిగించి, భగవంతుడిని పూజించడం, ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది. కార్తీక మాసంలో చేసిన ప్రతి ఆచారం, కార్యం భక్తి , పవిత్రతతో చేయబడాలి, తద్వారా దివ్య శక్తుల అనుగ్రహాన్ని పొందవచ్చు.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ అల‌ర్ట్‌!