Gun Fire-Karni Sena : రాజ్‌పుత్ కర్ణిసేన ప్రెసిడెంట్ పై కాల్పులు.. నిందితుణ్ని పట్టుకొని ఏం చేశారంటే ?

Gun Fire-Karni Sena :  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌ పూర్ లో కలకలం రేగింది. రాజ్‌పుత్ కర్ణిసేన రాష్ట్ర  అధ్యక్షుడు బన్వర్‌సింగ్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం   ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • Written By:
  • Updated On - August 13, 2023 / 05:22 PM IST

Gun Fire-Karni Sena :  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌ పూర్ లో కలకలం రేగింది. రాజ్‌పుత్ కర్ణిసేన రాష్ట్ర  అధ్యక్షుడు బన్వర్‌సింగ్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం   ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బన్వర్‌ సింగ్‌.. వేదికపై నుంచి కిందికి దిగి వెళ్తుండ ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వెంటనే కర్ణిసేన కార్యకర్తలు నిందితుణ్ని పట్టుకొని చితకబాదారు.

Also read : Abdul Kalam-Grinder : అబ్దుల్ కలాం.. ఒక చెక్కు.. ఒక గ్రైండర్.. స్ఫూర్తి రగిల్చే స్టోరీ

నిందితుడు రాజ్‌పుత్ కర్ణిసేన మాజీ సభ్యుడు దిగ్విజయ్‌గా గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్యాయత్నం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.  ఇక బన్వర్‌ సింగ్‌ వెన్నులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్‌పుత్ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా కర్ణిసేన(Gun Fire-Karni Sena)  వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Also read : Rule In Cricket: క్రికెట్ లో ఈ రూల్ గురించి తెలుసా..? బ్యాట్స్‌మెన్ ఇలా చేస్తే ఔట్..?!