Site icon HashtagU Telugu

Karnataka: కర్ణాటకలో ‘వాట్సాప్’ దుమారం.. పలువురికి గాయాలు, ఉద్రిక్తత!

Karnataka

Karnataka

శనివారం వైరల్ అయిన సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన పోస్ట్ పై నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్లు రువ్వడంతో ఆదివారం కర్ణాటకలోని హుబ్బల్లిలో నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. హింసాకాండలో నలుగురు పోలీసులతో సహా పలువురు గాయపడ్డారని తెలిపారు. హింసాకాండ తర్వాత దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు హుబ్బల్లి-ధార్వాడ్ నగర పోలీసు కమిషనర్ లాభూరామ్ తెలిపారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. పాత హుబ్బల్లి లో చాలా మంది ప్రజలు గుమిగూడి, అవమానకరమైన మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసిన అభిషేక్ హిరేమత్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆనంద్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి హీరేమత్‌ను అరెస్టు చేసి పాత హుబ్బళ్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిరసనకారులు పోలీసు స్టేషన్‌ను ఘెరావ్ చేశారు, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. హింసలో ఒక ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. “వాట్సాప్ స్టేటస్ పోస్ట్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు.