కర్ణాటక రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ (Karnataka State Journalist Union).. తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ (Telangana Media Academy Chairman) శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) ని సత్కరించింది. తాజాగా శ్రీనివాస్ రెడ్డి బెంగుళూర్ లో పర్యటనకు వెళ్లిన నేపద్యంలో ఆయన్ను కర్ణాటక రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మీడియా అకాడమి చైర్‌పర్సన్ ఆయేషా ఖానుమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రెండు రాష్ట్రాల మధ్య జర్నలిస్టుల సహకారం మరియు మద్దతు యొక్క ప్రాముఖ్యతను శ్రీనివాస్ రెడ్డి వివరించారు. సమాచార హక్కులు, న్యాయ విధానాలు, జర్నలిస్టుల సంక్షేమం మరియు మీడియా శిక్షణపై ఫోకస్ చేయడం వంటి విషయాల గురించి పేర్కొన్నారు.
శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే..గతంలో విశాలాంధ్ర పత్రికకు కే శ్రీనివాస్ రెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ పదవిలో కె.శ్రీనివాస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగుతారు. అంతకు ముందు అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన స్థానంలో కె.శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
Read Also : Vijay Devarakonda : హాలీవుడ్ స్టార్ ని దించుతున్న విజయ్ దేవరకొండ..!