Site icon HashtagU Telugu

Karnataka Syllabus Controversy: కర్ణాటక పాఠ్యపుస్తలలో కెబి హెడ్గేవార్‌ కథ తొలగింపుకు రంగం సిద్ధం

Karnataka Syllabus

New Web Story Copy (83)

Karnataka Syllabus Controversy: ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్‌ గురించి బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని పాఠ్యపుస్తలలో ప్రచురించింది. అయితే తాజాగా అక్కడ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ మేరకు పాఠ్యపుస్తకాలలో కెబి హెడ్గేవార్‌ జీవిత చరిత్రను తొలగించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.

కెబి హెడ్గేవార్‌కు సంబంధించిన విషయాలను పాఠశాల పాఠ్యపుస్తకాల నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ విషయాన్ని వెల్లడించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కర్ణాటక మాజీ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ ముస్లింల ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలో ఆ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి ప్రభుత్వంగా వర్ణించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమని అన్నారు మాజీ మంత్రి.

దేశ నిర్మాణానికి సహకరించిన వ్యక్తుల కథలు పాఠ్యపుస్తకాలలో ఉండాలని, అంతే గానీ వ్యక్తిగత వ్యక్తుల గురించి పాఠ్యపుస్తకాలలో ఉంచడం సరైనది కాదని అన్నారు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి గురించి భావితరాలకు తెలియాలని ఆయన సూచించారు.

Read More: Temple: ఆలయానికి వెళ్తున్నారా.. అయితే అలా అస్సలు చేయకండి?