Site icon HashtagU Telugu

Karnataka: కర్ణాటక క్యాబినెట్ కీలక నిర్ణయం.. ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్

Karnataka Cabinet

Karnataka Cabinet

Karnataka: కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు గృహనిర్మాణంలో రిజర్వేషన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదించిన ఈ ప్రతిపాదన ప్రకారం, పేద ముస్లిం కుటుంబాలకు గృహల కేటాయింపులో ప్రత్యేక కోటాను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. పట్టణ , గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని హౌసింగ్ పథకాలపై ఇది వర్తించనుంది.

ఈ నిర్ణయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇస్తూ, ముస్లిం వర్గాలకు గృహాలు కేటాయించడంలో సమాన హక్కు కల్పించే చర్యగా అభివర్ణించారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, ‘‘జనాభా పరంగా చూస్తే మైనారిటీలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, అధికంగా ఉన్నారు. అందువల్ల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకున్నాం’’ అని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ఇళ్లను మైనారిటీ లబ్ధిదారులతో నింపే విధంగా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. మంత్రి ఎంసీ సుధాకర్ మాట్లాడుతూ, కేంద్రం ఇప్పటికే మైనారిటీలకు 15 శాతం కోటా అమలు చేస్తోందని, రాష్ట్రం అదే దిశగా ముందుకెళ్తోందని చెప్పారు.

OG Business : మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ బిజినెస్

ఇది వరకే కాకుండా, కర్ణాటక ప్రభుత్వం మరో కీలకమైన కర్ణాటక ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత (సవరణ) బిల్లు-2025ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో భాగంగా రూ. 2 కోట్ల లోపు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మత ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్లు కల్పించడం సరికాదని విమర్శిస్తోంది. ఈ బిల్లును మే 22న రాష్ట్రపతి , గవర్నర్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ, మతపరమైన రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.

Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు