Site icon HashtagU Telugu

Tomatoes Stolen: రూ. 2.5 లక్షల విలువైన టమాటాలు దొంగతనం.. ఘటన ఎక్కడ జరిగిందంటే..?

Tomato Prices

Tomato Prices

Tomatoes Stolen: దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. కూరగాయల నుంచి పప్పుల వరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు (Tomatoes Stolen) రికార్డులను బద్దలు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కిలో రూ.100 దాటాయి. చాలా రాష్ట్రాల్లో టమాటా కిలో రూ.150కి చేరింది. టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా సామాన్యుడి జేబుకి చిల్లులు పెడుతున్నాయి. టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు బంగారం-వెండి లేదా ఇతర విలువైన వస్తువుల చోరీ గురించి మీరు వినే ఉంటారు. కానీ హాసన్ జిల్లాలో విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏ ఇంట్లోనో, బంగ్లాలోనో దొంగలు చోరీకి పాల్పడలేదు. రైతు పొలంలో దొంగలు పడ్డారు. రైతు పొలంలో లక్షల రూపాయల విలువైన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: Gurpatwant Singh Pannun: రోడ్డు ప్రమాదంలో గురుపత్వంత్ సింగ్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం.. ఇందులో నిజమెంత..?

2.5 లక్షల విలువైన టమోటాలు అపహరణకు గురయ్యాయి

టమాటా దొంగతనం కేసు జూలై 4 రాత్రి తన పొలంలో కిలోల కొద్దీ టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లారని రైతు ధరణి తెలిపింది. టమాట ధర దాదాపు రూ.2.5 లక్షలు. రెండెకరాల పొలంలో టమాట పంట సాగు చేశానని ధరణి పేర్కొంది. టమాటా పంటను పండించి మార్కెట్‌లో విక్రయించాలనే ఆలోచనలో ఉండగా, ఆ సమయంలో దొంగలు టమాటాను ఎత్తుకెళ్లారు.

దొంగలపై కేసు పెట్టారు

టమోటా దొంగతనంపై రైతు ధరణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనగ పంటలో నష్టం వచ్చిందని, అందుకే అప్పు చేసి టమాటా సాగు చేశానని ధరణి చెప్పింది. టమోటాలు దొంగిలించిన తరువాత, దొంగలు తన పంటను కూడా ధ్వంసం చేశారని ధరణి తెలిపింది. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.