Karnataka Election Results 2023: కర్ణాటక రిజల్ట్స్ ప్రధాని సీటుపై ప్రభావం? కోట్ల రూపాయల బెట్టింగులు

కర్ణాటక (Karnataka) రిజల్ట్ దేశ ప్రధానిని డిసైడ్ చేయబోతుందా?. ఒక్క రాష్ట్రంలో పార్టీ చేజారిపోతే ఆ ప్రభావం పీఎం సీటుకే ఎసరు కానుందా?. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయం హీటెక్కుతోంది.

Karnataka Election Results 2023: కర్ణాటక రిజల్ట్ దేశ ప్రధానిని డిసైడ్ చేయబోతుందా?. ఒక్క రాష్ట్రంలో పార్టీ చేజారిపోతే ఆ ప్రభావం పీఎం సీటుకే ఎసరు కానుందా?. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయం హీటెక్కుతోంది. కర్ణాటక కుర్చీని కాంగ్రెస్ ఆల్మోస్ట్ కైవసం చేసుకున్నట్టే. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ప్రధానంగా పోటీలో నిలిచాయి. అయితే ఈ పోరులో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ కనిపించింది. ఈ రెండు పార్టీలలో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ 120 స్థానాలతో ముందంజలో ఉండగా.. బీజేపీ 70 స్థానాలకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఇక జేడీఎస్ ఊసే కనిపించలేదు. ఈ పోరులో జేడీఎస్ 26 సీట్లతో సరిపెట్టుకోనుంది.

కర్ణాటక ఎన్నికల వేళ (Karnataka Election Day) భజరంగ్ దళ్ ఎత్తివేస్తామని, ఆ విషయాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టిలో పెట్టినట్టు బీజేపీ ప్రచారం చేసింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. కానీ అక్కడ ఆ పప్పులేం ఉడకలేదు. బీజేపీ మత ప్రచారాన్ని కన్నడీయులు పట్టించుకోకపోగా, కాంగ్రెస్ కి ఓట్లు గుద్ది బీజేపీ కి షాకిచ్చారు. కర్ణాటకలో మరోసారి పార్టీని అధికారంలోకి దీసుకొచ్చేందుకు బీజేపీ ఎత్తుగడలు ఫలించలేదు. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్ బీజేపీకి ఎన్నో గుణపాఠాలు నేర్పిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో విశేషం ఏంటంటే కర్ణాటకలో గత 38 ఏళ్లుగా ఒకటే రిపీట్ అవుతుంది. అక్కడ వరుసగా ఒకే పార్టీ అధికారం చేపట్టిన సందర్భాలు లేవు. ఈ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయింది. మొన్నటివరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా.. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది.

కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వ్యక్తులు కూడా జోరుగా బెట్టింగుల్లో పాల్గొంటున్నారు.ఓ వ్యక్తి కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని 2 ఎకరాలు బెట్టింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా కర్ణాటక రిజల్ట్స్ పై కోట్లాదిరూపాయల బెట్టింగులు కొనసాగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కాగా.. కర్ణాటక సీటు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ రిజల్ట్ బీజేపీకి వినాశానికి వార్నింగ్ లా ప్రచారం చేస్తున్నారు.

Read More: MLAS CAMP : ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్