Site icon HashtagU Telugu

Karnataka Election Result 2023 : నేడు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్‌.. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభంకానున్న కౌంటింగ్‌

Karnataka Polls

Karnataka Elections

ఈ నెల 10 న కర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు నేడు వెలువ‌డ‌నున్నాయి. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప‌క్రియ ప్రారంభంకానుంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప‌క్రియ సాగ‌నుంది. కౌంటింగ్‌కు సంభందించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స‌మ‌స్య‌త్మాక ప్రాంతాల‌పై పోలీసులు నిఘా పెట్టారు. బెంగుళూరులో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్‌కే మొగ్గుచూపాయి. బీజేపీ మాత్రం తమ‌కు మెజార్టీ స్థానాలు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంది. షిగ్గాన్ స్థానం నుంచి సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై , చెన్నాప‌ట్నం నుంచి మాజీ సీఎం కుమార‌స్వామి, వ‌రుణ నుంచి మాజీ సీఎం సిద్ధారామ‌య్య‌, క‌న‌క‌పురం నుంచి డీకే శివ‌కుమార్ పోటీ చేశారు. మ‌ద్యాహ్నం క‌ల్లా ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Exit mobile version