Site icon HashtagU Telugu

Karnataka: మామిడి చెట్టుపై ఉన్న కోట్ల రూపాయలను జప్తు చేసిన ఐటీ?

Karnataka

Karnataka

కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో కర్ణాటకలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ఆయా పార్టీలు మొదలు పెట్టేసాయి. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు ఇందులో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ఈ ఎన్నికల సమయంలో కోట్ల కొద్ది డబ్బులు చేతులు మారుతున్నాయి.

ఇప్పటివరకు దాదాపుగా రూ.300 కోట్లకు పైగా డబ్బుని ఎన్నికల సంఘం సాధనం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క బెంగళూరులోనే దాదాపుగా రూ. 82 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మైసూరులోనే ఒక వ్యక్తి ఇంట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయల డబ్బుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పెరట్లోని ఒక చెట్టులో బాక్సులు ఉండటాన్ని గమనించారు. వెంటనే వాటిని తీసి చూడగానే నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు.

ఆ మొత్తం డబ్బులను లెక్కపెట్టగా దాదాపు కోటి రూపాయలు వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇప్పటికే 2,346 ఎఫ్ఐఆర్ లు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీ జరగనున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నారు. అంతేకాకుండా ఐటి అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version