Basavaraj Bommai : ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సీఎం…ఎక్కడో తెలిస్తే షాక్ తింటారు..!!

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాలా ఎమోషనల్‌ అయి కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో ఆయన తన చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.

Published By: HashtagU Telugu Desk
A1aaf723 10ca 4156 9256 F515c8 1200x768

A1aaf723 10ca 4156 9256 F515c8 1200x768

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాలా ఎమోషనల్‌ అయి కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో ఆయన తన చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. రీసెంట్‌గా ఓ సినిమా చూసి బయటకు వచ్చిన బసవరాజ్ బొమ్మై, ఆ సినిమా చూశాక తన కుక్క గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడని చెప్పుకుంటున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల విడుదలైన విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘777 చార్లీ’ సినిమా చూశారు. ఈ సినిమా మొత్తం ఓ కుక్క దాని యజమాని మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ముఖ్యంగా జంతు ప్రేమికులందరూ ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెడుతున్న సంగతి తెలిసిందే. సీఎం బొమ్మైకి ఈ సినిమా తెగ నచ్చింది. ఈ సినిమా చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యాడు.

సీఎం బొమ్మై కూడా జంతు ప్రేమికుడే, గతేడాది తన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. అయితే ‘777 చార్లీ’ సినిమా చూశాక తన పెంపుడు కుక్క గుర్తుకొచ్చి ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. సినిమా చూసి అనంతరం బొమ్మై మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎమోషన్స్, జంతువులతో కూడిన సినర్జీ ఉందని అన్నారు.

ఈ చిత్రంలో నటించిన కుక్క తన భావాలను కళ్ల ద్వారా వ్యక్తపరిచిందని తెలిపారు. సినిమా బావుంది అందరూ చూడాల్సిందే. నేను షరతులు లేని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని స్వచ్ఛమైనదని గుర్తు చేసుకున్నారు. రక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

  Last Updated: 14 Jun 2022, 02:21 PM IST