Site icon HashtagU Telugu

Yediyurappa Airport:శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌కి య‌డ్యుర‌ప్ప పేరు.. ఆమోదం తెలిపిన క‌ర్ణాట‌క మంత్రివ‌ర్గం

POCSO Act

yediyurappa

శివమొగ్గ విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేరు పెట్టాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆమోదం కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. బుధవారం సాయంత్రం సోగానే గ్రామంలో ఎయిర్‌పోర్టు స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో బొమ్మై మాట్లాడుతూ విమానాశ్రయానికి యడ్యూరప్ప పేరు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పారు.శివమొగ్గ విమానాశ్రయం ఇప్పుడు ఉడాన్ పథకం కిందకు వస్తుందని..

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి క్లియరెన్స్ పొందాల‌ని బొమ్మై తెలిపారు. ఇది పూర్తయితే నైట్‌ ల్యాండింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. డిసెంబరులో ప్రారంభోత్సవానికి ముందే అన్ని పనులు పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని సీఎం బొమ్మై తెలిపారు

Exit mobile version