Facebook: యువకుడిని నగ్న కాల్స్ చేయమని అడిగిన యువతీ.. అసలు విషయం తెలియడంతో?

ఇటీవల కాలంలో చాలా మంది యువత ఆన్లైన్ మోసాల బారిన పడి మోసపోతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్లు అమ్మ

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 07:40 PM IST

ఇటీవల కాలంలో చాలా మంది యువత ఆన్లైన్ మోసాల బారిన పడి మోసపోతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్లు అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అబ్బాయిలకు గాలం వేసి వారి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని వీడియో కాల్స్ చేసి న్యూడ్ ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. యువతి పేరుతో ఫేక్ ఫోటో పెట్టిన ఒక దుండగుడు 10, 20 కాదు ఏకంగా రూ.41 ఒక లక్షల రూపాయలు దోచుకున్నాడు.

అసలేం జరిగిందంటే.. కునిగల్ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్ అనే 24 ఏళ్ల యువకుడు బెంగుళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈజీ మనికి అలవాటు పడిన ఇతను ఫేస్బుక్లో యువతీ పేరుతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అబ్బాయిలకు గాలం వేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాజేష్ అనే యువకుడు ఆ ఫేక్ ప్రొఫైల్ చూసి డీపీలో ఫోటో చూసి చాలా అందంగా ఉండడంతో నిజమైన ప్రొఫైల్ అనుకోని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. రిక్వెస్ట్ వచ్చిన వెంటనే రవికుమార్ యాక్సెప్ట్ చేసి అమ్మాయిలాగా చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం తెలియని రాజేష్ అమ్మాయి అనుకొని తెగ మురిసిపోయి తన వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా చెప్పేసాడు.

ఒకసారి న్యూడ్ కాల్ చేయాలని రవికుమార్ చెప్పడంతో ఒక క్షణం ఆలోచించకుండా రాజేష్ వీడియో కాల్ చేశాడు. దుస్తులన్నీ విప్పేసి రవికుమార్ తో వీడియో కాల్ మాట్లాడాడు. అవతల రవికుమార్ తన ఫేస్ కనిపించకుండా మేనేజ్ చేసి రాజేష్ పర్సనల్ ఫోటోలు స్క్రీన్ షాట్ తీశాడు. తర్వాత నుంచి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫొటోలు బయటికి పోతే పరువు పోతుందని భావించిన రాజేష్, రవికుమార్ అడిగినప్పుడల్లా విడుదల వారిగా దాదాపు 41 లక్షలు ముట్ట చెప్పాడు. అయినప్పటికీ రవికుమార్ తనను విస్తగిస్తుండడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు రాజేష్. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశారు.