Site icon HashtagU Telugu

Karnataka: పరీక్ష హాలులోకి ఆ వస్తువులు నిషేధం.. కీలక నిర్ణయం

Karnataka (1)

Karnataka (1)

Karnataka: కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయంలో అన్ని రకాల పేస్ మాస్క్ లను నిషేధిస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళనల నేపథ్యంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు అనుమతిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ పరికరాల ద్వారా అభ్యర్థులు చేసే మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించే చర్యల్లో భాగంగా ముఖాన్ని కప్పివేసే అన్ని రకాల వస్త్రాలను నిషేదించారు. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే వస్త్రం ధరించే వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఫోన్‌లు లేదా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పరీక్ష హాల్‌లోకి అనుమతించరు. అదనంగా ఆభరణాలపై నిషేధం ఉంటుంది. అయితే వివాహిత హిందూ స్త్రీలు మంగళ సూత్రాలు, నల్లపూసలు మరియు మెట్టెలు ధరించవచ్చు.

అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కేఈఏ హిజాబ్‌లను అనుమతించడం గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 23న కేఈఏ నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు బ్లూటూత్ పరికరాలను వినియోగించారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11న రాష్ట్ర సీఐడీ విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో రాష్ట్రంలో తరగతి గదులలో హిజాబ్‌ను నిషేధించడం తీవ్ర కలకలం రేపింది, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Also Read: Nampally Fire Accident: బిల్డింగ్ ఓనర్‌ రమేష్ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు

Exit mobile version