Site icon HashtagU Telugu

Metro Rail : బొమ్మసంద్ర నుంచి హోసూరు వరకు మెట్రో రైలును పొడిగింపు.. ఆమోదం తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌

Metro Rail

Metro Rail

బెంగళూరు మెట్రో ప్రాజెక్టును బొమ్మసంద్ర నుండి టిఎన్‌లోని హోసూరు వరకు 20.5 కి.మీ పొడవునా పొడిగించేందుకు కర్ణాటక ఆమోదం తెలిపిందని కృష్ణగిరి ఎంపి డాక్టర్ ఎ చెల్లాకుమార్ తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది. దీనికి సంబంధించి మే 23న బిఎంఆర్‌సిఎల్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (మోహువా) మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపిందని చెల్లకుమార్ తెలిపారు. బిఎమ్‌ఆర్‌సిఎల్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‌-2 ఆర్‌వి రోడ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బొమ్మసంద్ర వరకు అమలవుతోందని..ఫేజ్-1, దీనికి తోడు, తమిళనాడులోని హోసూరు వరకు 20.5 కి.మీ విస్తరణను కర్ణాటక ముఖ్యమంత్రి ఆమోదించారని తెలిపారు. దీనిలో 11.7 కి.మీ కర్ణాటకలో మిగిలిన 8. 8 కి.మీ తమిళనాడులో ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. బొమ్మసంద్ర నుంచి హోసూరు మధ్య మెట్రో మార్గాన్ని తమిళనాడు అధ్యయనం చేయవచ్చని ఆ ప్రతిపాదనలో పేర్కొంది.

బొమ్మసంద్ర నుండి హోసూరు వరకు కారిడార్ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తుందని, ప్రాజెక్టు వ్యయాన్ని పంచుకోవడంలో సమన్వయం, రెండు రాష్ట్రాల మధ్య ద్రవ్య సహకారం అవసరమని ఎంపీ పేర్కొన్నారు. లోక్‌సభలో మెట్రో సర్వీస్‌ను పొడిగించే అంశాన్ని ఎంపీ లేవనెత్తారు. నిత్యం బెంగళూరుకు ఉద్యోగాలకు వెళ్లే హోసూరులోని వేలాది మంది ప్రజల కలల ప్రాజెక్టు ఇదేనని, ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఇరు రాష్ట్రాల ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా మేలు జరుగుతుందని చెల్లకుమార్‌ అన్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు త్వరలో సీఎం ఎంకే స్టాలిన్‌ను కలుస్తానని ఎంపీ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టును రూపొందించాలని కర్ణాటక సీఎంకు లేఖ రాయనున్నారు.

Exit mobile version