Karimnagar youths: కాంబోడియాలో కరీంనగర్ యువకులు.. విదేశాంగకు బండి లేఖ

ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని

  • Written By:
  • Updated On - September 23, 2022 / 01:32 PM IST

ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని కాంబోడియాలోని భారత దౌత్యకార్యాలయం సూచించింది. కరీంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్‌ స్కాంలకు పాల్పడే చైనా వారి చేతిలో బందీలుగా మారిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా కాంబోడియాలో చిక్కుకున్న కరీంనగర్ యువకులను స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. కాంబోడియాలో ఉపాధి కోసం వెళ్లి చైనా కు చెందిన సైబర్ స్కామ్ కేఫ్ లో చిక్కుకున్న ఆరుగురు యువకులు ఉపాధి కోసం కంబోడియా వచ్చే వాళ్ళు కన్సల్ టెన్సీ ల మాయలో పడవద్దని భారత దౌత్య కార్యాలయం సూచన జారీ చేసింది. ఆరుగురు యువకులను కాపాడాలని విదేశాంగ శాఖ కు ఎంపీ బండి సంజయ్ లేఖ రాసారు. భారతీయులు కంబోడియాలో ఉన్న మానవ అక్రమ రవాణా, ఇతర మోసాల సంస్థల ముఠాల చేతుల్లో పడి ఇబ్బందులు పడుతున్నట్లు దౌత్య కార్యాలయాలనికి ఫిర్యాదు చేశారు. దీంతో.. టూరిస్టు విశాలతో దళారుల మాటలు నమ్మి కాంబోడియా రావద్దని దౌత్య కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అయితే.. ఉపాధి కోసం ఎక్కడో విదేశాలకు వెళ్లిన వారు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని తిరిగి స్వదేశానికి చర్యలు తీసుకు రావాలని పలువురు బాధిత మహిళలు సెప్టెంబర్‌ 20 కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణను కలిశారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువకులు కొన్నాళ్ల కిందట కంబోడియాకు వెళ్లారు. దీంతో కరీంనగర్‌ లోని కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ చూపిస్తామన్న పని కాకుండా వేరే పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుల సంఘం ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. సిరిసిల్ల పట్టణానికి చెందిన నవీన్ తల్లి నిలోఫర్ బేగం సీసీ ని కలిసి తన కుమారుడిని స్వగ్రామానికి రప్పించాలని వేడుకొన్నారు.

రూ.2 లక్షలు తీసుకొని కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందని అక్కడికి పంపించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం తన కొడుకు చేత ఇతర పనులు చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు… నవీన్ తో పాటు సైబాజ్ ఖాన్, షారుక్ ఖాన్, సలీం, హాజీబాబా ముంబైకి చెందిన టిప్పుసుల్తాన్ అక్కడ ఉన్నట్లు వారి సంబంధీకులు తెలిపారు. అయితే.. మరోవైపు కరీంనగర్ లో ఉన్న కన్సల్టెన్సీల విషయమై పోలీసులు ఆరా తీశారు. కంబోడియాకు వెళ్లిన వారి సంఖ్య ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మంది వరకు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు సమాచారాన్ని తెలుసుకున్న వ్యవహారంపై, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు తదుపరి విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించినట్లు తెలిసింది.