Site icon HashtagU Telugu

Kapil Sibal: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. కపిల్ సిబల్ రాజీనామా!

Kapil Sibal

Kapil Sibal

కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయగా.. కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తుండటంతో హస్తం అస్తవ్యస్తమవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు కేంద్ర మాజీ మంత్రి అయిన కపిల్‌ సిబల్‌ వెల్లడించారు.

“నేను మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. “నేను ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిని కాను” అని ఆయన మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పరాజయాల తర్వాత కాంగ్రెస్ పునర్ వైభవం కోసం రోడ్‌మ్యాప్‌ను చర్చించడానికి, కాంగ్రెస్ మేధోమథనం సెషన్ ముగిసిన ఒక రోజు తర్వాత సిబల్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. “నేను స్వతంత్ర అభ్యర్థిగా నా పత్రాలను దాఖలు చేశాను. పార్లమెంటులో స్వతంత్ర వాణిగా ఉండటం ముఖ్యం. ఒక స్వతంత్ర స్వరం మాట్లాడితే అది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రజలు నమ్ముతారు” అని సిబల్ అన్నారు. అయితే బుధ‌వార‌మే అధికారికంగా సిబాల్ స‌మాజ్‌వాదీ స‌భ్య‌త్వం కూడా తీసుకోనున్నారని స‌మాచారం.

మిస్టర్ సిబల్ కాంగ్రెస్ అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు.  “G-23” 23 మంది అసమ్మతివాదుల సిబల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాదు.. గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కపిల్ సిబల్ నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.