బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదం కోసం ఇవాళ తిరుపతికి వెళ్లారు. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ కథానాయకుడిగా నటించిన ధకడ్ సినిమా మే 20న విడుదల కానుంది. ఆమె దర్శనానికి సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగనా రనౌత్ గోల్డెన్ వర్క్ కూడిన పర్పుల్ సిల్క్ చీరలో మెరిసింది. తక్కువ మేకప్ వేసుకోవడం వల్ల ట్రెడిషనల్ గా అందంగా ఉంది.
ఆమె వెంట నిర్మాత దీపక్ ముకుత్ ఉన్నారు. ఈ మూవీ లో కంగనా మునుపెన్నడూ విధంగా కనిపించబోతోంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, ఆమె అభిమానులు కూడా అదే చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. రజ్నీష్ రజీ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శాశ్వత ఛటర్జీ, దివ్య దత్తా లాంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.