Site icon HashtagU Telugu

Kangana and Yogi: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్…యోగిని ఎందుకు కలిసినట్లు..?

kangana UP CM

kangana UP CM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..నటి కంగనా రనౌత్ లక్నోలోని యోగి ఆధిత్యానాథ్ అధికారిక నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా అకౌంట్లో కంగనా ఫోటోలను షేర్ చేశారు.

కాగా వీరిద్దరూ గతేడాది అక్టోబరులో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మరోసారి భారీ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి యోగికి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. కంగనా తన ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసి..రనౌత్ తన పోస్టుకి క్యాప్షన్ చేస్తూ…ఈమధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అవకాశం ఈరోజు నాకు కలిగింది. ఇదొక అద్బుతమైన సాయంత్రం మహారాజ్ జీ ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపింది. కాగా గతంలో కూడా యూపీ సీఎం ఎలక్షన్స్ లో విజయం సాధించిన తర్వాత…కంగనా యోగిని కలిసి అభినందించారు.

Exit mobile version