Site icon HashtagU Telugu

Kane Williamson: న్యూజిలాండ్ కు భారీ షాక్.. విలియమ్సన్ కు సర్జరీ.. ప్రపంచ కప్ కి డౌటే..!

Kane Williamson

Resizeimagesize (1280 X 720) (4)

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కేన్ విలియమ్సన్ (Kane Williamson) బౌండరీ లైన్‌పై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. గాయం తీవ్రంగా ఉండడంతో సహాయక సిబ్బంది సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ గాయం తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతని క్రూసియేట్ లిగమెంట్ ఫ్యాక్చర్ అయిందని, దాని నుండి కోలుకోవడానికి అతనికి శస్త్రచికిత్స అవసరమని ధృవీకరించింది. అదే సమయంలో ఈ గాయం మధ్యలో న్యూజిలాండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ బయటకు వస్తోంది. వాస్తవానికి ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ 2023 ODI ప్రపంచ కప్ నుండి కూడా నిష్క్రమించవచ్చు.

కేన్ విలియమ్సన్ 2023 ప్రపంచ కప్ కు దూరం..?

కేన్ విలియమ్సన్ (Kane Williamson) గాయం, శస్త్రచికిత్సను పరిశీలిస్తే.. అతను ప్రపంచ కప్ 2023 నుండి నిష్క్రమించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో ప్రపంచకప్ జరగనుంది. మరోవైపు వచ్చే మూడు వారాల్లో కేన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇంత తక్కువ సమయంలో శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ఈ దృష్ట్యా అతను ప్రపంచ కప్ 2023 ఎంపిక చేసిన జట్టులో భాగం కాలేడని సమాచారం.

Also Read: Yuzvendra Chahal: ఐపీఎల్ లో అరుదైన ఘనత సాధించిన చాహల్.. రెండో స్థానంలో ఆర్ఆర్ బౌలర్..!

https://twitter.com/PrithishNarayan/status/1642094161120690176?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1642094161120690176%7Ctwgr%5Eccec9a04e9fa5946fbd2663387c4e2b2d167535c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPrithishNarayan%2Fstatus%2F1642094161120690176%3Fref_src%3Dtwsrc5Etfw

గాయం తర్వాత కేన్ విలియమ్సన్ ప్రకటన

అదే సమయంలో గాయం తర్వాత న్యూజిలాండ్ వెటరన్ కేన్ విలియమ్సన్ పెద్ద ప్రకటన ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా నాకు చాలా మద్దతు లభించిందని, ఇందుకు నేను గుజరాత్ టైటాన్స్, న్యూజిలాండ్ క్రికెట్ రెండింటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేన్ చెప్పాడు. సహజంగానే ఇలాంటి గాయం కావడం చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ నా దృష్టి ఇప్పుడు శస్త్రచికిత్స చేసి నా పునరావాసం ప్రారంభించడంపైనే ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే నేను వీలైనంత త్వరగా మైదానంలోకి రావడానికి సాధ్యమైనదంతా చేస్తాను అని పేర్కొన్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో కేన్ రాణించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా కూడా నిలిచాడు.