Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో పాటు కమలహాసన్.

Kamal Haasan In Bharat Jodo Yatra

Kamal Haasan In Bharat Jodo Yatra

కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) నేడు ఢిల్లీలో (Delhi) ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రతి చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాహుల్ వెంట పలువురు ప్రముఖులు నడుస్తున్నారు. తాజాగా, ఢిల్లీలో జరుగుతున్న యాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమలహాసన్ (Kamal Haasan) పాల్గొని వెంట నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ ఆహ్వానం మేరకు భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి కమల్ నడుస్తారని MNM పార్టీ ఇప్పటికే తెలిపింది. కాగా, నెన్న (శనివారం, డిసెంబర్ 24న) ఢిల్లీలో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ తల్లి సోనియాగాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర డిసెంబరు 16తో వంద రోజులు పూర్తి చేసుకుంది.

Also Read:  Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!