Site icon HashtagU Telugu

Kalvakuntla Kavitha: కుమారుడి పాఠశాలను విజిట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

mlc Kavitha

Kavitha

పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు అద్బుతమైన ప్రాజెక్టులు రూపొందించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తన కుమారుడు ఆర్య పాఠశాలకు వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత, విద్యార్థులు రూపొందించిన అనేక రకాల ప్రాజెక్ట్ వర్క్ లను ఆసక్తిగా పరిశీలించారు. పర్యావరణం, జంతు సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్ లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కుమారుడు ఆర్య చేసిన ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఒక తల్లిగా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.