సలార్ (Salaar) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అభిమానుల్లో సంతోషం నింపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..ఇప్పుడు కల్కి (Kalki ) మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ‘కల్కి’ టీజర్ కు సంబంధించిన రన్ టైమ్ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ల నిడివితో టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మూవీ ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది మే 9వ తేదీన రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ థియేటర్లలో అనౌన్స్ చేయడం విశేషం. సంక్రాంతి సినిమాలు ఆడుతున్న థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఇక మే 09 న వైజయంతీ మూవీస్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఈ డేట్ నా వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. దీంతో అదే రోజు రిలీజ్ చేయాలని నిర్మాత అశ్వినీదత్ ఫిక్స్ అయ్యాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ జోడి గా నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also : Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు