Minor Death: బెంగాల్ మైనర్ బాలిక మృతిపై తీవ్ర నిరసన

బెంగాల్‌ నార్త్ దినాజ్‌పూర్‌లో మైనర్ బాలిక మృతిపై ప్రజలు తీవ్ర నిరసన చేపట్టారు. పరిస్థితిని నివారించేందుకు పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు

Published By: HashtagU Telugu Desk
Minor Death

Minor Death

Minor Death: బెంగాల్‌ నార్త్ దినాజ్‌పూర్‌లో మైనర్ బాలిక మృతిపై ప్రజలు తీవ్ర నిరసన చేపట్టారు. పరిస్థితిని నివారించేందుకు పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలియాగంజ్‌లో ప్రజలు నిరసనలు తెలిపారు. కొంతసేపటికి నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. కొందరు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Read More: Jio Cinema: జియో సినిమా నుంచి మూడు అదిరిపోయే ప్లాన్స్.. ధరల వివరాలు ఇవే?

  Last Updated: 25 Apr 2023, 06:01 PM IST