Site icon HashtagU Telugu

Kalaavathi Song: కళావతి పాట.. రికార్డుల మోత!

Kalavati

Kalavati

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట విడుదలకే ముందే అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి థమన్ సంగీతం చాలా కీలకం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదల అయిన కళావతి అనే మెలోడీ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో 2 మిలియన్ లైక్‌లతో ఇప్పటివరకు 150 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో నిజానికి అత్యంత వేగంగా 150 మిలియన్ల మార్కును చేరుకున్న మొదటి పాట. ఈ పాట చాలా కాలంగా యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది. ఇప్పటికీ ఆడియో స్ట్రీమింగ్ లో టాప్ లో ఉంది. ఈ సందర్భంగా కళావతి పాటలోని కొత్త స్టిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మహేష్ బాబు ఒక చేతిలో పెన్నీ (కరెన్సీ), మరో చేతిలో పర్సుతో కనిపిస్తున్నాడు. పెన్నీ సాంగ్, టైటిల్ ట్రాక్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. మిగిలిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు టీమ్. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట మే 12న థియేటర్లలోకి రానుంది.