Site icon HashtagU Telugu

Kakani Govardhan Reddy Arrest: కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్

Lookout Notice Issued For Kakani Govardhan Reddy

Lookout Notice Issued For Kakani Govardhan Reddy

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy ) క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ (Kakani Govardhan Reddy Arrest) అయ్యారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి నెలలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న కాకాణిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఈరోజు ఎట్టకేలకు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు, రవాణా, పేలుడు పదార్థాల వినియోగంపై నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.

Top 10 Car Accidents: 2024లో అత్యధిక కారు ప్రమాదాలు జరిగిన 10 దేశాలివే!

గుంటూరు రేంజ్ పోలీసులు ఈ కేసులో గట్టి చర్యలు తీసుకుంటూ, కాకాణిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను ఏపీకి తరలిస్తున్నారు. సోమవారం ఉదయం నెల్లూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి భద్రత నడుమ చర్యలు తీసుకుంటున్నారు. అరెస్ట్ వార్త వెలువడిన వెంటనే నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. వైసీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు, కాకాణి అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.