Site icon HashtagU Telugu

Kajol: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటి కాజోల్.. ‘కష్టతరమైన దశను అనుభవిస్తున్నాను’ అంటూ..!

Kajol

Resizeimagesize (1280 X 720) (3)

Kajol: బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ (Kajol) శుక్రవారం ఒక పెద్ద ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు కాజోల్ (Kajol) ప్రకటించింది. నటి శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించింది. బాలీవుడ్ నటి కాజోల్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి విరామం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టి అభిమానులకు సమాచారం అందించింది. ఆశ్చర్యకరంగా కాజోల్ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి అన్ని పోస్ట్‌లను తొలగించింది. ఆమె ప్రొఫైల్‌లో కేవలం ఒక పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. దాని క్యాప్షన్‌లో.. నేను సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నాను అని రాసి ఉంది.

తన జీవితంలో కష్టతరమైన దశను అనుభవిస్తున్నానని నటి చెప్పింది. కాజోల్ చేసిన ఈ పోస్ట్ ఆమె అభిమానులను కలవరపెడుతోంది. చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కాజోల్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Bollywood Singles: పెళ్లి వద్దు.. సహజీవనమే ‘ముద్దు’ అంటున్న బాలీవుడ్ స్టార్స్!

కాజోల్ చివరిసారిగా ‘సలామ్ వెంకీ’ చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె అనారోగ్యంతో బాధపడుతూ, అనాయాస కోరే తల్లి పాత్రను పోషించింది. కాజోల్ సోషల్ మీడియా నుండి విరామం గురించి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో సమాచారం ఇచ్చింది. రెండు చోట్లా ఒకే పోస్ట్‌ను షేర్ చేసింది. కాజోల్ ఇన్‌స్టాగ్రామ్ నుండి తన పాత పోస్ట్‌లను కూడా తొలగించింది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో కాజోల్ ఇప్పటి వరకు చెప్పలేదు. నటి హఠాత్తుగా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పే సంఘటన ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు జోరందుకుంది.

Exit mobile version