Site icon HashtagU Telugu

Kajal Aggarwal Exercise Video: జిమ్‌లో కాజల్ అగర్వాల్…బేబీ బంప్ తో ఏరోబిక్..!!

Kajal Agwarl Imresizer

Kajal Agwarl Imresizer

టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్….బాడీ షేమింగ్ గురించి ఇన్ స్టా ఓ పోస్టులో చెప్పిన విషయం తెలిసిందే. గర్భిణి అయిన కాజల్…పండంటి బిడ్డకి జన్మనించేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించేందుకు రెడీ అవుతోంది. సుఖ ప్రసవం కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ…ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

తన మొదటి బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న ఈ జంట తన ప్రెగ్నెన్సీ ఫిట్ నెస్ పైనా ప్రత్యేక శ్రద్ద వహించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఎరోబిక్, స్ట్రెంగ్స్ కండిషనింగ్ ఎక్స్ సైజులు చేస్తోంది. ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తున్న వీడియోన్ కాజల్ పోస్టు చేసింది. ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చిందీ ఈ ముద్దుగుమ్మ.

ప్రెగ్నెన్సీ ఎక్సర్ సైజ్ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన కాజల్ క్యాప్షన్ ఇలా ఇచ్చింది. ‘నేను ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాను…నేను జీవితాంతం వర్క్ అవుట్ చేస్తూనే ఉంటాను. ప్రెగ్నెన్సీ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ లాంటిది..ఎలాంటి సమస్యలు లేకుండా ప్రెగ్నెన్సీ మహిళలందరూ కూడా ఏరొబిక్ లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ లో భాగంగా స్ట్రెంగ్త్ కండిషనింగ్ ఎక్సర్ సైజులు చేయడం ద్వారా శరీరాన్నిమెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాయమాలపై నాకు మరింత బలం వస్తుంది. గర్భధారణలో ఏరోబిక్ కండిషనింగ్ లక్ష్యంగా మామూలుగా ఉంటే సరిపోతోంది. పీక్ ఫిట్ నెస్ ను చేరుకోవాలని ప్రయత్నించకూడదని’ పేర్కొంది.