Kadiyam Kavya: వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌.. ఎంపీ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకున్న క‌డియం కావ్య‌

వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 11:35 PM IST

Kadiyam Kavya: వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని కావ్య పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు మ‌న్నించాల‌ని లేఖ‌లో వేడుకున్నారు.

రేపు కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..?

బీఆర్ఎస్ కీలక నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కడియం శ్రీహరితోపాటు కడియం కావ్య కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ ఢిల్లీలో ఉన్నారని, కాంగ్రెస్ పెద్దలతో శ్రీహరి మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ బరిలో నుంచి కావ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Jagan Public Meeting at Nandyal : బాబు వస్తే రాష్ట్రంలో కరువే – నంద్యాల సభలో జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్య..?

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కావ్య కూడా రేపు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కావ్యను బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా బీఆర్ఎస్ తరపున పోటీ నుంచి కావ్య తప్పుకున్నారు.

We’re now on WhatsApp : Click to Join