KA Paul: కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం…జగన్ ఏపీని ముంచేశాడు: కేఎ పాల్

కేఎ.పాల్ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఎంతో హడావుడి చేసిన ఆయన తర్వాత కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 12:48 AM IST

కేఎ.పాల్ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఎంతో హడావుడి చేసిన ఆయన తర్వాత కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు. వచ్చీ రావడంతోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై శాపాలు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు. ఏపీలో జగన్ పాలన చాలా అరాచకంగా ఉందన్నారు. అంతేకాదు రానున్న ఎలక్షన్స్ లో టీఆరెస్ పార్టీకి 30 సీట్లు కూడా రావన్నారు. మొత్తానికి కేఏ పాల్ ఎంట్రీతో ఒక తుఫాను లాంటి పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్ కు వచ్చి కేఎ పాల్ …రాజభవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసారు. పలు అంశాలపై చర్చించారు. అనంతం మీడియాతో మాట్లాడారు ఆయన. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అంత అవినీతిపాలన ఇప్పటి వరకు చూడలేదన్నారు. కేసీఆర్ అరెస్టు ఖాయమన్నారు. ఏడు సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీ తరపున తెలంగాణలో అన్ని జిల్లాలో పర్యటిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాలని పాల్ పిలుపునిచ్చారు.

ఇక రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ తన శిష్యుడేనని పాల్ చెప్పారు. ఆయన్ను అడ్డంపెట్టుకుని కేసీఆర్ కొత్త రాజకీయానికి తెరతీస్తున్నారని విమర్శించారు. తెలంగాణ డెవలప్ కు 1982 నుంచి తాను ఎంతో క్రుషి చేస్తున్నట్లు పాల్ తెలిపారు. బంగారు తెలంగాణ ఎక్కడుంది…అప్పులు తెలంగాణ మాత్రమే మిగిలిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం బీజేపీకి మద్దతు తెలిపి…ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో కేసీఆర్ తనను కలిసి ఆశీస్సులు తీసుకున్నారని…ఇప్పుడు 30 సీట్లు కూడా గెలవడం కష్టమని జోస్యం చెప్పాడు.

అటు ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పాల్. ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. మరో 20ఏళ్ల ఎవరు పాలన చేసిన ఇబ్బందులేనని ఆవేదన వ్యక్తం చేశారు. 18 పార్టీల నేతలు…తాను కలిసి ఆగస్టులో సమావేశం పెట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో సాగుతోన్న జగన్ పాలనపై తీవ్రంగా స్పందించాడు. ఏడు లక్షల కోట్ల అప్పుతో ఏపీ పూర్తిగా అంధకారంలోకి పోయిందని ఆయన ఆరోపించారు.