Site icon HashtagU Telugu

KA Paul Attack Video: కేఏ పాల్‌పై దాడి చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

KA Paul attacked

KA Paul attacked

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. సిద్ధిపేట జిల్లా జ‌క్కాపూర్ గ్రామంలో అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దు వ‌ద్ద అడ్డుకుని దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. ఏకంగా డీఎస్పీ ముందే కేఏ పాల్ పై వారు చేయి చేసుకున్నారు.

అయితే దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తేనని కేఏ పాల్ చెబుతున్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడి ఘ‌ట‌న అనంత‌రం వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందకు కేఏ పాల్ వెళ్లారు.