Site icon HashtagU Telugu

Canada : ట్రూడో రాజీనామా కోరుతూ..సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌

justin-trudeau-own-party-pressuring-canadian-pm-to-step-down-sets-deadline

justin-trudeau-own-party-pressuring-canadian-pm-to-step-down-sets-deadline

Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పై సొంతపార్టీ భగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అక్టోబరు 28లోపు ప్రధాని పదవి నుంచి ట్రూడో తప్పుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పేర్కొన్నారు. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీలలో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది.

బుధవారం, లిబరల్ పార్టీ ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది జూన్ మరియు సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ట్రూడో వ్యూహం కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందని సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ట్రూడోకు సన్నిహితుడిగా ఉన్న ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చాలా రోజులుగా చర్చనీయాంశంగా ఉంది. ప్రజలు తమ ఆలోచనలను బయటపెట్టాలి. ఎంపీలు నిజాయితీగా ప్రధానికి ఎన్నికల్లో జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయనకు వినడం ఇష్టం ఉన్నా లేకపోయినా వారు మాత్రం చెప్పేశారు” అని రిపోర్టర్ల వద్ద వ్యాఖ్యానించారు.

మరోవైపు, కెనడా ప్రభుత్వం వలస నియంత్రణలో కీలక మార్పులు చేస్తోంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇది అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించినప్పటికీ, 2025లో ఈ సంఖ్య 3,80,000కు మాత్రమే పరిమితం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. “కెనడాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాం. కంపెనీలకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు తీసుకురానున్నాం. నియామకాల విషయంలో స్థానికులపై ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విషయాన్ని కంపెనీలు స్పష్టం చేయాలి” అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగబోతున్నందున, ఈ సందర్భంలో చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనకంజలో ఉన్నట్లు వెల్లడైంది.

Read Also: BJP : యూపీ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల