Site icon HashtagU Telugu

Telangana : నేడు తెలంగాణ చీఫ్ జ‌స్టిస్‌గా భూయ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం

New High Court

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్‌ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వ‌స్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొన‌సాగుతుంది. గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ పెరగడంతోనే.. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Exit mobile version