Site icon HashtagU Telugu

High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

Ujjal

Ujjal

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు మంగళవారం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. జస్టిస్ భుయాన్ 2011లో గౌహతి హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అతను జ్యుడిషియల్ అకాడమీ, అస్సాం, నేషనల్ లా యూనివర్సిటీ, గౌహతి లాంటి న్యాయపరమైన సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. తరువాత 2019 లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. బొంబాయి హైకోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన తర్వాత, 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిగా బదిలీ అయ్యారు.