తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్(Justice Madan Bhimrao Lokur)ను ప్రభుత్వం (Telangana Government) నియమించింది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. కాగా దానిపై బిఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో విద్యుత్ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన లోకూర్, 2011లో ఏపీ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తించారు.
Read Also : Wayanad Landslide: వాయనాడ్ బాధితులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా