Site icon HashtagU Telugu

Phone Call: ఏ సేవకైనా 112కు డయల్ చేస్తే చాలు

Phoness

Phoness

Phone Call: ఇప్పటివరకు ఒక్కో సమస్యకు సంబంధించి ఒక్కో నంబరుకు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఆ నంబర్ బిజీగా ఉంటే సమస్య అవతలి వారికి తెలిసేది కాదు. వెంటనే ఆ నంబరు గుర్తుకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేవలన్నింటినీ ఒకే నంబరు 112 కిందకు తీసుకొచ్చింది. ఇకపై ఏ సేవ కావాలన్నా ఆ నంబరుకు ఫోన్ చేస్తే సంబంధిత విభాగానికి కాల్ బదిలీ చేస్తారు. ఏదైనా అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం కోసం 100, అగ్నిమాపక సేవలకు 101, వైద్య సేవలకు 108, చిన్నారుల రక్షణకు 1098 నంబర్లకు ఫోన్ చేయాలని అందరికీ తెలిసిందే.

Also Read: Earthquake In Pakistan: రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌ లో భారీ భూకంపం..?