NTR: ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ.. ట్రెండీ అప్‌డేట్..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్గీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ చిత్రాన్ని చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మ‌రోచిత్రాన్ని కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ తార్వ‌త చిత్రం ఉంటుందని స‌మాచారం. ఈ చిత్రంలో గ్రామీణ నేప‌ధ్యంలో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. తార‌క్ మార్క్ యాక్ష‌న్స్ […]

Published By: HashtagU Telugu Desk
Rrr S Behind The Scenes Pictures Leaked Featuring Alia Bhatt Ram Charan Jr Ntr Amp Ajay Devgn 163387085200

Rrr S Behind The Scenes Pictures Leaked Featuring Alia Bhatt Ram Charan Jr Ntr Amp Ajay Devgn 163387085200

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్గీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ చిత్రాన్ని చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మ‌రోచిత్రాన్ని కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ తార్వ‌త చిత్రం ఉంటుందని స‌మాచారం.

ఈ చిత్రంలో గ్రామీణ నేప‌ధ్యంలో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. తార‌క్ మార్క్ యాక్ష‌న్స్ అండ్ ఎమోష‌న్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ క‌థ‌ను సిద్ధం చేశార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మాణం జ‌రుపుకోనుంది. గ‌తంలో క‌బ‌డ్డీ నేప‌ధ్యంలో వ‌చ్చిన ఒక్క‌డు, క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ, సీటీమార్ చిత్రాలు మంచి విజ‌యాలు సాధించిన నేప‌ధ్యంలో, తాజాగా క‌బ‌డ్డీ నేప‌ధ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఎన్టీఆర్ చిత్రం పై ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

 

  Last Updated: 02 Feb 2022, 01:15 PM IST