Site icon HashtagU Telugu

Trump-Rape Charge-True : ట్రంప్ పై మహిళా జర్నలిస్ట్ రేప్ అభియోగం దాదాపు నిజమే : కోర్టు

Trump Rape Charge True

Trump Rape Charge True

Trump-Rape Charge-True :  తనపై రేప్ కేసు పెట్టిన 79 ఏళ్ళ మహిళా జర్నలిస్ట్ ఈ జీన్ కారోల్‌పై  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువునష్టం దావాను న్యూయార్క్‌ కోర్టు కొట్టేసింది. 

న్యూయార్క్‌ ఫెడరల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి లూయిస్ కప్లాన్ ఈమేరకు తీర్పు ఇచ్చారు. 

తనపై  డొనాల్డ్ ట్రంప్  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ జీన్ కారోల్‌ చేసిన అభియోగాలు దాదాపు నిజమైనవే అని తీర్పులో జడ్జి  పేర్కొన్నారు.

Also read : Today Horoscope : ఆగస్టు 8 మంగళవారం రాశి ఫలితాలు.. ఆ రాశిలోని పొలిటికల్ లీడర్లకు బ్యాడ్ టైం

1990వ దశకంలో ఒక లగ్జరీ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్ (77  ఏళ్ళు)  తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈ జీన్ కారోల్‌ చేసిన వాదనలతో కోర్టు దాదాపు  ఏకీభవించింది.  ట్రంప్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అయితే అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించలేమని గతంలో ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆనాటి నుంచి తనపై ట్రంప్  అత్యాచారం చేశాడంటూ కారోల్‌ నిత్యం మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనల వల్ల తన పరువుకు నష్టం కలుగుతోందంటూ ఇటీవల న్యూయార్క్‌ ఫెడరల్ కోర్టులో ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సోమవారం తాజాగా తీర్పు ఇచ్చింది.  మహిళా జర్నలిస్ట్ ఈ జీన్ కారోల్‌పై ట్రంప్ వేసిన కేసును కొట్టివేసింది. 1990వ దశకంలో ఈ జీన్ కారోల్‌ తో ట్రంప్ వ్యవహరించిన తీరు దాదాపు రేప్ తరహాలోనే(Trump-Rape Charge-True) ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.