Site icon HashtagU Telugu

National Handloom Day : మంత్రి కేటీఆర్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన ప‌వ‌న్‌..!

Pavan Imresizer

Pavan Imresizer

చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో పాటు పవన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్రబాబు, తెలంగాణకు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ ‘చేనేత’ సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు.