Jr NTR & Koratala: వాయిదాల పర్వంలో ‘ఎన్టీఆర్ 30’

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివల ఎన్టీఆర్ 30 డిసెంబర్ 2021లో ప్రారంభం కావాల్సి ఉంది.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 02:35 PM IST

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివల ఎన్టీఆర్ 30 డిసెంబర్ 2021లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎందుకో ఆలస్యమైంది. అయితే సీన్ కట్ చేస్తే.. నేటికీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. భవిష్యత్తులోనైనా షూటింగ్ స్టార్ట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ తో కలిసిన నటించిన రాంచరణ్ మాత్రం.. జట్ స్పీడుతో షూటింగ్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. చరణ్ ఇప్పటికే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సి 15’ షూటింగ్ ప్రారంభించాడు. ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం.. ఈ కాంబోలోని సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారట. కానీ ఎన్టీఆర్ సినిమాపై ఇంతవరకు స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఒక్కింత నిరాశకు గురవుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్ 30’ సినిమా కోసం కొరటాల శివతో పనిచేయనున్నాడు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ జూన్‌లో షూటింగ్ ప్రారంభించవచ్చని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆగస్ట్‌లో ప్రారంభం కానుందట. సినిమా షూటింగ్స్ వాయిదా మీద వాయిదాలు పడుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 30 మూవీ మేకర్స్ ఇటీవలే మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ 30 నిజానికి ఈ ఆగస్టులో లేదా బహుశా తర్వాత కూడా సెట్స్‌పైకి వస్తే, ఈ చిత్రం 2023 చివరి భాగంలో మాత్రమే థియేట్రికల్ విడుదలకు వెళ్లవచ్చు. ఈ మూవీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పూర్తిస్థాయిలో కథ రూపుదిద్దుకోలేదని టాలీవుడ్ టాక్.