Site icon HashtagU Telugu

Jr NTR Holidays: ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్!

Ntr

Ntr

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ ప్రాజెక్టుపై ఫోకస్ చేయనున్నాడు. #NTR30, #NTR31 కోసం రెడీ అవుతున్నాడు. అయితే కొరటాల శివతో తీయబోయే సినిమా కాస్త ఆలస్యమవుతుండటంతో తారక్ ఫ్యామిలీ టూర్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. తన కుటుంబం, స్నేహితులతో సరాదాగా గడిపేందుకు సింగపూర్ కు వెళ్లాడు. అయితే సింగపూర్ టూర్‌లో ఎన్టీఆర్ గుర్తించిన అభిమానులు, సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురంభీం గా నటించి మెప్పించాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగేలా చేసింది. తన నెక్ట్స్ సినిమాలు కూడా భారీ ప్రాజెక్టులు కావడంతో ఎన్టీఆర్ బిజీబిజీగా ఉండే అవకాశం ఉంది. అవన్నీ సెట్స్ కు వెళ్లేలోగా ఫ్యామిలీతో చిల్ అవుతున్నాడు.

Exit mobile version