Site icon HashtagU Telugu

Jr. NTR : జూబ్లీహిల్స్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌

Jr. NTR

Jr. NTR

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప‌క్రియ స‌జావుగా సాగుతుంది. ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ కేంద్రాల‌కు భారీగా ఓట‌ర్లు చేరుకుంటున్నారు.అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మోర‌యించ‌డంతో పోలింగ్ ప‌క్రియ ఆల‌స్య‌మైంది. ఇటు హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్  ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆయ‌న స‌తీమ‌ణి ప్ర‌ణ‌తి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లో నిల‌బ‌డి త‌న ఓటు హ‌క్కును జూనియ‌ర్ ఎన్టీఆర్ వినియోగించుకున్నారు.సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. స‌మ‌స్య‌త్మ‌క ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంట‌ల‌కు పోలింగ్ ముగియ‌నుంది. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నిక‌ల అధికారులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటును వినియోగించుకోవాల‌ని ఎన్నిక‌ల అధికారులు ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.