Site icon HashtagU Telugu

JP Nadda: బండి సంజయ్ అరెస్టుపై జేపీ నడ్డా ఆరా, పార్టీ నేతలకు ఫోన్

JP NADDA

JP NADDA

టెన్త్ క్లాస్ క్వచ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టు అయిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ అధిష్టానం (JP Nadda) ఆరా తీసింది ఈ విషయం గురించి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  (JP Nadda)పార్టీ నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసిన జేపీ నడ్డా, బండి సంజయ్ అరెస్టు విషయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంజయ్ అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహారించిన తీరు గురించి రామచంద్రరావు జేపీ నడ్డాకు వివరించినట్లుతెలుస్తోంది. సంజయ్ సంఘీభావంగా పార్టీ నేతలంతా నిలబడాలని రామచంద్రరావుకు నడ్డా సూచించారు.

ఎలాంటి కారణం చెప్పకుండానే అరెస్టు చేయడంపై నడ్డా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు అరెస్టు చేయాలో నిలదీయాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. అయితే బండిసంజయ్ అరెస్టు విషయాన్ని తెలుసుకుని బొమ్మలరామారాం వెళ్లిన ఎమ్మెల్యే రఘునందనరావునుకూడా అరెస్టు చేసిన విషయాన్ని నడ్డా ద్రుష్టికి తీసుకెళ్లారు. నడ్డా ఆదేశాల మేరకు రామచంద్రరావు హైదరాబాద్ నుంచి బొమ్మలరామారం పీఎస్ కు బయలుదేరారు.

Exit mobile version