Site icon HashtagU Telugu

JP Nadda – Chandrababu : నడ్డాతో చంద్రబాబు ఏం మాట్లాడినట్లు..?

JP Nadda - Chandrababu Meeting

JP Nadda - Chandrababu Meeting

ఏపీలో రాబోయే ఎన్నికల్లో బిజెపి – టీడీపీ – జనసేన పార్టీలు (TDP Janasena BJP Alliance) కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలిసిందే. దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా..ఇదే కన్ఫామ్ అని అర్ధం అవుతుంది. ఈ మూడు పార్టీల టార్గెట్ జగన్ (YCP Government) ను గద్దె దించడమే. ఇప్పటికే మూడు పార్టీలు మూడు కోణాల్లో జగన్ ఫై యుద్ధం మొదలుపెట్టాయి. మరోపక్క ఢిల్లీ లోను ఇదే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ అప్పులు , ఓటర్ల తొలగింపు, ఇసుక మాఫియా మొదలగువాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఈ విషయం బయటపడిందని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : KTR tweets : కాంగ్రెస్ డిక్లరేషన్ సభ ఫై మంత్రి కేటీఆర్ సెటైర్లు

నేడు రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ (NTR 100 Rupees Coin Release) కార్యక్రమం చేసారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, మాజీ సీఎం , టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు (JP Nadda – Chandrababu) ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందని అంత అనుకుంటున్నారు. రాష్ట్రంలో జగన్ పాలన వైఫల్యాలను జేపీ నడ్డాకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. ఓటర్ల తొలగింపు అక్రమాలనూ నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకొచ్చారని అంటున్నారు. ఇప్పటికే పలు మార్లు కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారని..మరోసారి దీని గురించి నడ్డా కు వివరించినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు పక్కనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఉండడం గమనించవచ్చు.

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని (Rs100 coin) విడుదల చేశారు. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.