Site icon HashtagU Telugu

Jos Buttler: బట్లర్ సెంచరీల దండయాత్ర

Jose Butler

Jose Butler

టీ ట్వంటీ ఫార్మేట్ లో నిలకడగా హాఫ్ సెంచరీలు చేయడమే అంత ఈజీ కాదు.. అలాంటిది ఒకే సీజన్ మూడు సెంచరీలు చేయడమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్ ఇదే ఘనత సాధించాడు. ఈ సీజన్ లో మూడు శతకాలతో దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. టోర్నీ ఆరంభం నుంచీ భీకర ఫామ్ తో దూసుకుపోతున్న బట్లర్ ఢిల్లీ పైనా దానిని కొనసాగించాడు.బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికి ఆరేశాడు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా.. తన బ్యాట్‌తో ఒకేరకమైన పనిష్‌మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్లో 57బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బట్లర్‌ 65 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌లో బట్లర్ మూడో సెంచరీ నమోదు చేశాడు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 491 పరగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ తర్వాత ఒక సీజన్ కు సంబంధించి అత్యధిక సెంచరీలు చేసింది బట్లర్ మాత్రమే,. 2016 సీజన్ లో కోహ్లీ 4 సెంచరీలతో చెలరేగిపోతే…ఇప్పుడు బట్లర్ మూడు సెంచరీలు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే బట్లర్ తర్వాత గేల్, హషీమ్ ఆమ్లా, వాట్సన్, ధావన్ ఉన్నారు. ప్రస్తుతం బట్లర్ ఫామ్ చూస్తుంటే కోహ్లీ రికార్డును సమం చేసే అవకాశాలున్నాయి.
కాగా వరుస సెంచరీలతో అదరగొడుతున్న బట్లర్‌పై నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్‌లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు